Verse
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
Verse
యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని‖ 2x ‖
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని‖ దేవుని ‖
Verse
గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని‖ దేవుని ‖
Verse
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని‖ దేవుని ‖
Verse
ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని‖ దేవుని ‖
Verse
దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి‖ దేవుని ‖
Verse
ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని‖ దేవుని ‖
Verse
పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును‖ దేవుని ‖
Verse
గుర్రముల నరులదలి బలము నానందించుడు
కృప వేడు వారిలో సంతసించువాడని‖ దేవుని ‖
Verse
యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని‖ దేవుని ‖
Verse
పిల్లల నాశీర్వదించియు బలపరచు నీగుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును‖ దేవుని ‖
Verse
భూమికి తన యాజ్ఞన ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును‖ దేవుని ‖
Verse
వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనయు కీలాగున చేసి యుండ లేదని‖ దేవుని ‖