Chorus
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
Verse
యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని
Verse
గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడని
వారి గాయములన్నియు - కట్టుచున్న వాడని
Verse
నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్న వాడని
Verse
ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
Verse
దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును
సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
Verse
ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు
భూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని
Verse
పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచును
అరచుపిల్ల కాకులకును - ఆహారము తానీయును
Verse
గుర్రముల నరులందరి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించు వాడని
Verse
యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని
Verse
పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును
Verse
భూమికి తన యాజ్ఞను - యిచ్చుపాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును
Verse
వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
ఏ జనము కీలాగున - చేసియుండ లేదని