Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuniki Stotramu Ganamu Cheyutaye Man

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మం

Devuniki Stotramu Ganamu Cheyutaye Man

Verse
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
Verse
యెరుషలేము యెహోవాయే కట్టుచున్న వాడనీ
ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని
Verse
గుండె చెదరిన వారిని బాగుచేయు వాడనీ
వారి గాయము లన్నియు కట్టుచున్న వాడని
Verse
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని
Verse
ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని
Verse
దీనులకు అండాయనే భక్తి హీనుల కూల్చును
సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడి
Verse
ఆయన ఆకాశము మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము సిద్ధ పరచు వాడని
Verse
పర్వతములో గడ్డిని పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును
Verse
యెరుషలేము యెహోవను సీయోనూ నీ దేవునీ
కీర్తించుము కొని యాడుము ఆనందించు వాడని

Related Tags

PraiseWorshipThanksgiving