Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devunitho Sahapaati Paalivaarigaanujese Thodivaarasulanugaa Manalanu Prabhu Jesenugaa

దేవునితో సహపాటి పాలివారిగానుజేసె తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా

Devunitho Sahapaati Paalivaarigaanujese Thodivaarasulanugaa Manalanu Prabhu Jesenugaa

Chorus
దేవునితో సహపాటి పాలివారిగానుజేసె
తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా
Verse
దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించె
అమూల్య వాగ్దానములిచ్చి దైవస్వభావ మొసగెనుగా
Verse
దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది
దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి
Verse
ప్రభు పరిశుద్ధతలో పాలి వారమగునట్లు
సకల శ్రమల పాలై దైవశిక్ష నొందితిమి
Verse
పరలోక పిలుపునందు పాలివారిగాను జేసె
తన యింటి వారినిగా జేయ మనల నేర్పరచె
Verse
తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మముజేసె
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా జేసె
Verse
క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది
దృఢముగా నిలిచెదము పట్టువదలక మనము
Verse
రాబోవు మహిమయందు పాలివారమౌ మనము
ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము

Related Tags

HolinessGraceSalvationInheritance