Verse
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా‖ 2x ‖
Verse
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు‖ 2x ‖
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు‖ 2x దేవుని ‖
Verse
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు‖ 2x ‖
సత్యమగు – జీవమగు – మార్గమేసే‖ 2x దేవుని ‖
Verse
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే‖ 2x ‖
ఆధారము – ఆదరణ – ఆయనలో‖ 2x దేవుని ‖
Verse
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను‖ 2x ‖
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు‖ 2x దేవుని ‖
Verse
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు‖ 2x ‖
శత్రువులు – మిత్రులుగా – మారుదురు‖ 2x దేవుని ‖
Verse
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు‖ 2x ‖
కనికర – సంపన్నుడు – నా దేవుడు‖ 2x దేవుని ‖
Verse
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద‖ 2x ‖
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ‖ 2x దేవుని ‖