Chorus
దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని
నడుపుమా‖ దేవర ‖
Verse
పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ‖ దేవర ‖
Verse
యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున‖ నిలువుమ దేవర ‖
Verse
అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ‖ దేవర ‖
Verse
పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున‖ గావుమ దేవర ‖
Verse
అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను
గొలుతుము దేవ‖ దేవర ‖
Verse
నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము‖ దేవర ‖
Verse
క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ‖ దేవర ‖