Chorus
దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను‖ దేవర ‖
Verse
దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ
నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై‖ దేవర ‖
Verse
ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె
యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము‖ దేవర ‖
Verse
ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ
దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్‖ దేవర ‖
Verse
తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ
దాపునుండి యాపద లన్నియుఁ బాపుచును‖ దేవర ‖
Verse
సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక
ముదమున నీ పాదము దాపునఁ బాదుకొనన్‖ దేవర ‖
Verse
మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ
నండనుండి వెండియు వానిని ఖండించవే‖ దేవర ‖
Verse
ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ
పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్‖ దేవర ‖
Verse
వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ
సుతుఁడౌ యేసుని పేరిటఁ బ్రోవు మామేన్‖ దేవర ‖