Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhahana Bali Neeku Nanishtamu Mariyu Dai

దహన బలి నీకు ననిష్టము మరియు దై

Dhahana Bali Neeku Nanishtamu Mariyu Dai

Lyricist: Mallela David
Chorus
దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే
యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు‖ దహన ‖
Verse
నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి
ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి‖ దహన ‖
Verse
అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్
ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు‖ దహన ‖

Related Tags

WorshipRepentanceOffering