Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhaiva Prema Pruthviloni Yannita

దైవ ప్రేమ పృథ్విలోని యన్నిట

Dhaiva Prema Pruthviloni Yannita

Lyricist: Charles Wesley Trans: H Henry David
Verse
దైవ ప్రేమ పృథ్విలోని
యన్నిటిని మించును
యేసు మాలో నివసించు
యది మా విముక్తియే
నీ కమూల్య ప్రేమ యుండు
నీవు దాసుల మైన మమ్ముఁ
గృపతో రక్షించుము.
Verse
మమ్ము సంరక్షించు శక్తి
నీకుండు, మా ప్రభువా
ఎన్నఁ డెనఁ డేని నీదు
సన్నిధిని బాయుము
నిన్ స్తుతించుచుండి మేము
సర్వదా సేవింతుము.
నిన్ బ్రార్థించి పూర్ణప్రేమ
మే మతిశయింతుము
Verse
క్రొత్తగా మమ్ము సృజించి
పాప మెల్లఁ బాపుము
మాకు స్వస్థత నొసంగి
గొప్ప రక్షఁ జూపుము
భక్తి యభివృద్ది పొంది
స్వర్గమందుఁ జేరగా
వింత నొంది ప్రేమ స్తుతి
నీకర్పింతు మెప్పుడు.

Related Tags

WorshipSalvationGods Love