Verse
దైవదర్శనమున యాకోబు - దివ్యముగను చూచి
ఆ స్థలమునకు బేతేలనియెడి నామమును తానిడియె
సుస్థిరముగ మన పరమ తండ్రి - వసియించెడి స్థలమిదియె
Verse
దేవుని నిచ్చెనగు క్రీస్తు దివికి నిలువబడెను
దేవుని దూతలు దానిపైని ఎక్కుచు దిగుచున్నారు
దేవుని మందిర మిదియె కాని వేరే స్థలమిదికాదు
Verse
నిశ్చయముగా నీ స్థలమందు - నిలిచి యుండె నెహోవా
ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ బొందగ రారే
విశ్రాంతి దేవునికి కలుగు - పాపికి భయంకరము
Verse
ఉన్నత స్థలముల నెక్కించి ఆనందింప జేసి
అనుభవమునందు యాకోబు - స్వాస్థ్యము నొసంగి
ఐగుప్తు యవమానమును దొరలింపజేయును
Verse
పర్వతములు తత్తరిల్లి తొలగిపోయినను
సర్వదా తన కృపతోడై - నిన్ను నడిపించును
పూర్వమందు పలికిన మాటల - నిర్వహించును నీలో