Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhaivathanayaa Kreesthunaathumdaa Ayyaa Paapulakai Praanamichchithivaa Dhaevudae Ninu Pampinaadaa

దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా

Dhaivathanayaa Kreesthunaathumdaa Ayyaa Paapulakai Praanamichchithivaa Dhaevudae Ninu Pampinaadaa

Chorus
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా
Verse
పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా
ప్రాణదానము చేసినావా - దేవా
పరలోకము తెరచినావా
Verse
కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము
కడిగి పావన పరచినావా - దేవా
కడుగు బూరతో రానై యున్నావా
Verse
మరణము జయించినావా మరణముల్లు విరచినావా
మహిమతోడ లేచినావా - దేవా
మాదు చింతలు దీర్చినావా
Verse
ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి
ధరణికే ఏతెంచినావా - దేవా
ధన్యులనుగా జేసినావా
Verse
ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు
అల్ఫయు ఓమేగయు నీవేగా - యేసు
ఆర్భటించుచు రానై యున్నావా

Related Tags

SalvationGood FridaySacrifice