Chorus
ధనరాశులున్నా - భవనాలు ఉన్నా - మనలేవు ధరలోన ఓ మానవా‖ 2x ‖
నాకేమి లే అంటూ - నిదురించకూ‖ 2x ‖
రారాజు రాకకు వేళాయెను‖ 2x ‖
Verse
ఏ రాత్రి ఆ ప్రభువు నిను పిలుచునో‖ 2x ‖
నీ ఆశలన్నీ కడతేరునో‖ 2x ‖
నువు కన్న కలలూ నిర్జీవమై‖ 2x ‖
నీ వెంట రాదు నీ ఆస్తి గానీ - నీ వెంట రారూ నీ వారు గానీ
Verse
అపవాది నిను పిలిచి బంధించునో‖ 2x ‖
ఆపైన అపరాధిగా నిలుపునో‖ 2x ‖
నీ పాప భారం విడిపించనూ - ఆ సిలువధారీ ఏతెంచెగా
పరలోక ప్రాప్తి కలిగించగా
నిను పిలిచె నేడు - నిలు పిలిచే నేడూ