Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhanyamu Entho Dhanyamu

ధన్యము ఎంతో ధన్యము

Dhanyamu Entho Dhanyamu

Verse
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము‖ 2x ‖
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును‖ 2x ‖
వారె ధన్యులు – వారెంతో ధన్యులు‖ 2x ధన్యము ‖
Verse
ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో‖ 2x ‖
ఎవరి పాపములు – మన్నించబడెనో‖ 2x వారె ధన్యులు ‖
Verse
క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు‖ 2x ‖
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు‖ 2x వారె ధన్యులు ‖
Verse
ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు‖ 2x ‖
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు‖ 2x వారె ధన్యులు ‖
Verse
ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును‖ 2x ‖
అపవాది తంత్రములు – గుర్తించు వారును‖ 2x వారె ధన్యులు ‖
Verse
శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును‖ 2x ‖
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును‖ 2x వారె ధన్యులు ‖

Related Tags

EncouragementChristian LifeBlessed