Chorus
ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము
ఇహమందున,పరమందున నూరు రెట్లు ఫలముండును
వారె ధన్యులు వారెంతో ధన్యులు‖ 2x ‖
Verse
ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో
ఎవరి పాపములు మన్నించబడెనో
Verse
క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు
క్రీస్తుయేసు స్వరము విను వీనులే వీనులు
Verse
ప్రభు యేసుని సేవచేయు పాదములే సుందరములు
ప్రభుని గూర్చి పాటపాడు పెదవులే పెదవులు
Verse
ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును
అపవాది తంత్రములు గుర్తించు వారును
Verse
శ్రమలయందు నిలచి పాడుచున్న వారును
శత్రు భాణములెల్ల చెదరగొట్టు వారును