Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhanyudavu Neevu Dhanyudavu O Ishrayelu Bahu Dhanyudavu

ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు

Dhanyudavu Neevu Dhanyudavu O Ishrayelu Bahu Dhanyudavu

Chorus
ధన్యుడవు నీవు ధన్యుడవు
ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు
యెహోవాయే నిన్ను విమోచించెను
ప్రజలలో నీవు మహా శ్రేష్టుడవు ధన్యుడవు
Verse
నీ పాపము పరిహారమాయె
నీ యతిక్రమము తుడువబడెన్
నిర్దోషియని నిన్నెంచె ప్రభు
ఆత్మలో కపటము లేదనెను
Verse
ఏర్పరచబడిన ధన్యుడవు
దరిజేరితివి నీ ప్రభుకడకు
చేర్చెను తన మందిరములోన
తృప్తిపరచె దాని సమృధ్దిచే
Verse
దుష్టుల యోచనలో వెళ్ళక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులతో కూర్చుండక
ధర్మశాస్త్రము ధ్యానించునీవు
Verse
ప్రభునిచే నీవు బలమొంది
ప్రభు మార్గము నీయందుండి
జలములలో నీవు నడచుచు
జలమయముగా చేయు నీవు
Verse
యెహోవాయే ఉత్తముడని
రుచిచూచి మరి ప్రభు నెరిగి
మహోన్నతుని ఆశ్రయించి
ఆరాధించు నీవు ధన్యుడవు

Related Tags

RedemptionBlessingIsrael