Verse
దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి
Verse
కాసు రూకలు లేకున్నను త్రాగను రండి
Verse
యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివి
త్రాగుచు తృప్తి పొందను రండి రండి
Verse
క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమును
క్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి
Verse
నేనే జీవపానమును - నేనే పరమాహారమును
రూకలను వ్యర్థము చేయక - రండి రండి
Verse
నా మాంసమే పరమాహారం - నే చిందించిన రక్తమేపానం
తిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం
Verse
ద్రాక్షారసము ఓదార్చున్ - జల్దరు తృప్తిపరచున్
నీకు నూనె ఉజ్జీవమునిచ్చున్నిచ్చున్
Verse
గొఱ్ఱెపిల్లలు దూడలును - తినువారికి చంపబడెను
వ్యర్థసాకులను చెప్పక రండి రండి
Verse
సర్వసమృద్ధిలోన దేవుడున్నాడు రండి
హల్లెలూయ పాటలుండును రండి రండి