Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dharaniloni Dhanamu Lella Dharanipalai Pa

ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై ప

Dharaniloni Dhanamu Lella Dharanipalai Pa

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను
నిరత ముండెడి ధనమును‖ ధరణి ‖
Verse
యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని
వేగము దివ్య వరముగ నమ్మికన్‖ ధరణి ‖
Verse
విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న
నీకుఁ గల్గు వేద నాధికంబుపో‖ ధరణి ‖
Verse
పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ
మిచ్చిన పరమధాముని నమ్ముమీ‖ ధరణి ‖
Verse
తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు
ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు‖ ధరణి ‖
Verse
దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు
మిత్ర నేట నెచట వెదకినన్‖ ధరణి ‖

Related Tags

SalvationJesus Christ