Verse
ధవళ సింహాసనం
దూతల స్తుతిగానం
పరిశుద్ధుల సహవాసం
యేసయ్య నివాసం
Verse
నిత్యముందును నా తండ్రితో
నిత్యానందములో నా యేసుతో
Verse
యేసయ్య దరహాసం
చేతిగాయాల కరచాలనం
కౌగిలింతల సుస్వాగతం
కేరింతల కోలాహలం
Verse
జీవ కిరీటం
జీవ జలపాతం
సుస్థిర నివాసం
పరలోక పురవాసం
Verse
కన్నీరు లేదు
కలత లేదు
కొరత లేదు
కష్టనష్టము లేదు
Verse
చీకటి లేదు
చావు లేదు
భారము లేదు
భయము లేదు