Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhayagala Yaesu Prabhoo Ninnu Yeruga Krupanimmu

దయగల యేసు ప్రభూ నిన్ను యెరుగ కృపనిమ్ము

Dhayagala Yaesu Prabhoo Ninnu Yeruga Krupanimmu

Verse
దయగల యేసు ప్రభూ - నిన్ను యెరుగ కృపనిమ్ము
సర్వజనము నీ పునరుత్థాన శక్తిని గ్రహియింప
Verse
యౌవనులయందు కలిగించుము నీ భయము మరి వణకును
నీ రక్షణను కొనసాగింప జేయుము ఓ ప్రభువా !
Verse
నీ మాటలు వినిపించుము నీ మార్గములలో నడిపించు
నిలుపుము నీదు సాక్షులు గాను యౌవన జనములను
Verse
అపవిత్రజనముల మధ్యలో నీ వాక్యమును ప్రకటింప
కుమ్మరించుము పరిశుద్ధాత్మను యౌవనజనములపై
Verse
నీ సంఘమునందు నిలుచుండి నీ దర్శనము గుర్తెరిగి
ఎల్లప్పుడునూ ఆనందింప జేయుము యౌవనులను
Verse
నీ మరణ పునరుత్థానములో పాలి వారినిగా జేసి
శ్రమలయందు నిన్ను కొనియాడ జేయుము యౌవనులను
Verse
నీ రాకడకై తీర్చుము ప్రభువా నిర్దోషులుగ యువజనుల
నీతి ఫలములు గల వారినిగా నింపుము మా ప్రభువా
Verse
ఉన్నత పిలుపును మరి గుర్తెరిగి నీ బహుమానములను పొంద
పరుగిడనిమ్ము నీ గురియందే హల్లెలూయ పాటలతో

Related Tags

PrayerYouthResurrection