Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dheenudaa Ajeyudaa Aadharana Kiranamaa

దీనుడా అజేయుడా ఆధరణ కిరణమా

Dheenudaa Ajeyudaa Aadharana Kiranamaa

Verse
దీనుడా అజేయుడా ఆధరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా
Verse
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవదారవు నీవని కానుకనై పూజించనా
అక్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే
Verse
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండ
హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్ర సంకల్పము నీవే
సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసెద
కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా
ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా

Related Tags

PraiseWorshipDevotional