Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dheevenala Nidu Devaa Needhu Sevakai Ve

దీవెనల నిడు దేవా నీదు సేవకై వె

Dheevenala Nidu Devaa Needhu Sevakai Ve

Lyricist: Panthagani Paradeshi
Chorus
దీవెనల నిడు దేవా నీదు సేవకై వెడలెడు దీనులపైఁ పావనాత్మ నంపుము
పనులలో నడిపింపుము కేవలంబుగ మా తనువులు నీ సేవకై యర్పింప
గజేయుము దీవెనల‖ దీవెనల ‖
Verse
మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ జను మనసులఁ త్రుంచి
మేటి క్రీస్తుని నామా మృతముఁ గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై
పనులు సల్ప(గ బంపుము కృపచే దీవెనల‖ దీవెనల ‖
Verse
దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింపఁ
పరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ
మర్మముల దీవెనల‖ దీవెనల ‖
Verse
దురిత రోగాదులచే మిగులఁ తూలి చను మనుజాళికి నీవే పరమ
విశ్రాంతి నిడు వరదుఁడ వంచుఁగడు వెరవునను బోధింపంగను నీ
వర ములతో నింపుము దాసులను దీవెనల‖ దీవెనల ‖
Verse
గ్రామ సంఘంబులను బడుల క్షేమముగఁ గాపాడి పెంప ఓ మహాత్మ
నీ కృప తో మమ్ముఁ గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము
మనగను బ్రోవు మామేన్ దీవెనల‖ దీవెనల ‖

Related Tags

DedicationBlessingService