Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dheevinchu Devaa Nee Biddalanu Dheevim

దీవించు దేవా నీ బిడ్డలను దీవిం

Dheevinchu Devaa Nee Biddalanu Dheevim

Lyricist: P P Shubhamani
Chorus
దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించుమీ గృహము
దేవపుత్రుల మంచి స్థావరంబుగ వెలసి సత్యకాంతుల బరుప దీవించు‖ దీవించు ‖
Verse
నీవే యీ గృహమునకు నిత్యతలపతివంచు నేవేళ నీ మనసు నెరిగి
జీవింపగ దీవించు‖ దీవించు ‖
Verse
సంభాషణలవేళ సన్నిహితుడా నీకు సంబరంబును గూర్చు సద్వా
క్కులను బలుక దీవించు‖ దీవించు ‖
Verse
భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను పూజ్యుండౌ యతిధిగ
పూజసల్పుచు బిలువ దీవించు‖ దీవించు ‖
Verse
ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక పరమాత్మనీసుతుల వలె జూచి
ప్రేమింప దీవించు‖ దీవించు ‖
Verse
అనుదిన ప్రార్థన లందు శ్రద్దాభక్తు లను జూపి క్రైస్తవ యనుభవంబుల
నొంద దీవించు‖ దీవించు ‖
Verse
క్రైస్తవగృహ విధులే గృహమున నెరవేర విస్తారమగు కృపను వీర
లందరి కొసగి దీవించు‖ దీవించు ‖
Verse
ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ యూర వీరు నీకింపగు
సాక్ష్యము నియ్య దీవించు‖ దీవించు ‖

Related Tags

PrayerBlessingFamily