Chorus
దేవుని ఉపకారంబులలోన - దేనిని మరువకుము
ఆయన చేసిన మేలులన్నియు - అనుదినమును ధ్యానించుము
Verse
నిరాశతో మనమున్నప్పుడు - నిరసించిపడియున్నప్పుడు‖ 2x ‖
మరణ చాయలో నున్నప్పుడు - మరువకుండ కాపాడెనుగా
Verse
వ్యాధులలో మనమున్నప్పుడు - బాధలలో మనమున్నప్పుడు‖ 2x ‖
వ్యాధుల బాధల తొలగించి - ఆదరించి కాపాడెనుగా
Verse
మహోపకారములన్నియును -యెహోవ దేవుడె చేసెనుగా‖ 2x ‖
అహోరాత్రులు ధ్యానించి - మహోన్నతుని స్తుతియించుము