Chorus
దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ
నెపుడు కర్త వీవే కర్త వీవే‖ దినదినమునకు ‖
Verse
పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ
గావు మమ్ముఁ గావు మమ్ము‖ దినదినమునకు ‖
Verse
పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ
బ్రాపు నీవే ప్రాపు నీవే‖ దినదినమునకు ‖
Verse
కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో
చూపుదువే చూపుదువే‖ దినదినమునకు ‖
Verse
నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ
దండ్రి వీవే తండ్రి వీవే‖ దినదినమునకు ‖
Verse
సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు
నిలిపితివే నిలిపితివే‖ దినదినమునకు ‖
Verse
ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై
బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము‖ దినదినమునకు ‖
Verse
విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ
శ్రేష్టముగను శ్రేష్ఠముగను‖ దినదినమునకు ‖