Verse
దివ్య పావనాత్మ, నీ
యీవు లన్ని మంచివి
నీదు ముఖ్యదానమీ
-దివ్య ప్రేమయే-‖ దివ్య ప్రేమయే ‖
Verse
ప్రేమ దయచూపును
ప్రేమ దీర్ఘశాంతము
మృతికన్న బలము
-దివ్య ప్రేమయే-‖ దివ్య ప్రేమయే ‖
Verse
కాలజ్ఞాన మంతయు
కొట్టి వేయబడును
ప్రేమ నిత్య ముండును
-దివ్య ప్రేమయే-‖ దివ్య ప్రేమయే ‖
Verse
దృష్టిగా విశ్వాసము
మాఱఁగా నిరీక్షణ
యనుభవమౌఁ గాని
-దివ్య ప్రేమయే-‖ దివ్య ప్రేమయే ‖
Verse
విశ్వాస నిరీక్షణ
ప్రేమ లీ మూడుండును
కాని శ్రేష్ఠమయినది
-దివ్య ప్రేమయే-‖ దివ్య ప్రేమయే ‖
Verse
పావనాత్మ! స్తోత్రము
నీకుఁ జేయు వారము
మాకు దయచేయుము
-దివ్య ప్రేమయే-‖ దివ్య ప్రేమయే ‖