Chorus
దూత గణములెల్ల ఆరాధించిరిగా - పరిశుధ్ధుడు సైన్యముల యెహోవని
ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి
Verse
నిష్కళoకమైనది నీ కను దృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో- చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము‖ దూత ‖
Verse
నా హృదయము నందు శుధ్ధి కలింగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
పెన్నుగాను పరిశుధ్ధుత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా‖ దూత ‖
Verse
నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుధ్ధ స్థలములో
ప్రవేశింపచేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా‖ దూత ‖