Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhootha Paata Paadudeerakshakun Sthu

దూత పాట పాడుఁడీరక్షకున్ స్తు

Dhootha Paata Paadudeerakshakun Sthu

Lyricist: Charles Wesley
Verse
దూత పాట పాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ
ఆ ప్రభుండు పుట్టెను
బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను
సౌఖ్యసంభ్ర మాయెను
ఆకసంబునందున
మ్రోగు పాట చాటుఁడీ
దూత పాట పపాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ.
Verse
ఊర్ధ్వలోకమందునఁ
గొల్వఁగాను శుద్ధులు
అంత్యకాలమందున
కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా
ఓ యిమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుఁడా
నిన్ను నెన్న శక్యమా?
దూత పాట పాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ
Verse
దావె నీతి సూర్యుఁడా
రావె దేవపుత్రుఁడా
నీదు రాకవల్లను
లోక సౌఖ్య మాయెను
భూనివాసు లందఱు
మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి
ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ

Related Tags

PraiseWorshipChristmas