Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhoothaganamulella Aaraadhimchirigaa Parishudhdhudu Sainyamula Yehoavani

దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవని

Dhoothaganamulella Aaraadhimchirigaa Parishudhdhudu Sainyamula Yehoavani

Verse
దూతగణములెల్ల ఆరాధించిరిగా
పరిశుద్ధుడు సైన్యముల యెహోవని
Verse
ఇహపరములలో ఆయన మహిమ
నిండియున్నదని గానము చేసిరి‖ 2x ‖
Verse
నిష్కళంకమైనది నీ కనుదృష్టి
నీవు చూడలేవుగా దుష్టత్వమును
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో
చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము
Verse
నా హృదయమునందు శుద్ధి కలిగించితివి
నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా
ఘనముగాను పొగడెదను పావన ప్రభువా
Verse
పాపముతో పతనమైన నా దేహమును
పరిశుద్ధాలయముగాని చేసికొంటివి
పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన
సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను
Verse
నీ రక్తముచేత నాకు కలిగించితివి
నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో
ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా
పూజించెద నిన్ను నాదు జీవితమంతా
Verse
పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు
పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి
సమస్తమును చేయుటకు బలపరచితివి
సమాధాన కర్తనీకే వందన స్తుతులు

Related Tags

PraiseWorshipHoliness