Verse
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
ఆకశంబునందున - మ్రోగు పాట చాటుడి
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
Verse
ఊర్థ్వలోకమందున - గొల్వగాను శుద్ధులు
అంత్యకాలమందున - కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
Verse
రావె నీతి సూర్యుడా - రావె దేవపుత్రుడా
నీదు రాకవల్లను - లోక సౌఖ్యమాయెను
భూనివాసులు అందరు - మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గును
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి