Chorus
దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు
తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు‖ దొ ‖
Verse
చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని
అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా‖ దొ ‖
Verse
వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి
నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె‖ దొ ‖
Verse
భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన
శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను‖ దొ ‖
Verse
విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి
ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ‖ దొ ‖
Verse
క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను
వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి‖ దొ ‖
Verse
కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు
కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే‖ దొ ‖
Verse
మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు
మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ‖ దొ ‖
Verse
దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై
దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు‖ దొ ‖
Verse
కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న
కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె‖ దొ ‖
Verse
చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ
దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి‖ దొ ‖