Verse 1
ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మ శాస్త్రము
మహిమకు మార్గము మనిషికి స్వర్గము
చూపించు దేవుని వాక్యము. . చూపించు దేవుని వాక్యము. .
Verse
నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు
జీవితమంతయు చేయున దంతయు
సఫలముగ జరుగును ఇది నమ్ముము‖ 2x ‖
Verse
త్రోవకు వెలుగు నిచ్చుదీపము ఆత్మకు బలమునిచ్చు దైవము
చదువుము అనుదినం ఈ ఉపదేశము
చేరెదము ఆ పరమ దేశము‖ 2x ‖