Chorus
ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా ధ్యానించ
వాసక్తి జ్ఞానంబుఁ గలిగించు జ్ఞాన స్వరూపుఁడు జ్ఞానాత్మచే నీకు
||ధ్యానింపవే||‖ ధ్యానింపవే ‖
Verse
అరయ నీ తలఁపుల నఘము లగుపడు నీకుఁ పరిశుద్ధుఁ డీక్షింప
బహుగా గనుపడుచుండు‖ ధ్యానింపవే ‖
Verse
పరికింపఁ బలుకులఁ పాప మగుపడు నీకు పరిశుద్ధుఁ డరయుఁ గ
న్పడకుండు నే యది‖ ధ్యానింపవే ‖
Verse
క్రియలను జింతింప మయిల గనపడు గాన భయ మొంది నమ్మికను
బదవే క్రీస్తుని దరికి‖ ధ్యానింపవే ‖
Verse
దేవుని ఘన ప్రేమ దినదినముఁ దలపోయ నీవు పొందఁగ వచ్చు
నిక్కమైన శుద్ధి‖ ధ్యానింపవే ‖
Verse
స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు భరియింప నోపుదువె పాప
మొక నిమిషంబు‖ ధ్యానింపవే ‖
Verse
హృదయంబు విమలాత్మ సదనంబుఁ గావింపఁ పదవే శ్రీఘ్రంబుగఁ
పరమ జనకుని కడకు‖ ధ్యానింపవే ‖
Verse
దేవుని సేవింపఁ దిరముగ నాశించి దేవాత్మ కొర కీవు దినము
దేవుని వేఁడ‖ ధ్యానింపవే ‖