Chorus
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు‖ 2x ‖
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా‖ 2x ‖
శ్రేష్టుడా…‖ ధ్యానించుచుంటిమి ‖
Verse
తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము‖ 2x ‖
అని ప్రార్ధన చేసావా బాధించే వారికి‖ 2x ‖
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై‖ 2x ‖
Verse
నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు‖ 2x ‖
అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి‖ 2x ‖
అధికారముతో పాపిని రక్షించి‖ 2x ‖
Verse
ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎప్పుడు‖ 2x ‖
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను‖ 2x ‖
తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను‖ 2x ‖
Verse
దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవె నా ప్రార్థనకు‖ 2x ‖
అని కేక వేసావా శిక్షననుభవిస్తూ‖ 2x ‖
పరలోక మార్గం సిద్ధము చేస్తూ‖ 2x ‖
Verse
సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని‖ 2x ‖
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు‖ 2x ‖
జీవ జలమును అనుగ్రహించుటకు‖ 2x ‖
Verse
సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం‖ 2x ‖
అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి‖ 2x ‖
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి‖ 2x ‖
Verse
నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని‖ 2x ‖
అని విన్నవించావా విధేయత తోటి‖ 2x ‖
తల వంచి తృప్తిగ విజయము చాటి‖ 2x ‖