Verse
దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే‖ 2x ‖
ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ‖ 2x ‖
నిత్యమై నాలోన – జీవమై నీవుండ‖ దిక్కులన్ని ‖
Verse
లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా
లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా‖ 2x ‖
నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే‖ 2x ‖
చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే‖ దిక్కులన్ని ‖
Verse
దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప
దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా‖ 2x ‖
భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట‖ 2x ‖
హీనమైన రూపానాన – గానమై యేసన్న‖ దిక్కులన్ని ‖