Verse
దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా‖ 2x ‖
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో‖ 2x ‖
Verse
కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు‖ 2x ‖
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను‖ 2x ‖
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు‖ 2x ‖
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి‖ దిక్కులెన్ని ‖
Verse
దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల‖ 2x ‖
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును‖ 2x ‖
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు‖ 2x ‖
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో‖ దిక్కులెన్ని ‖