Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dinadinambu Yesuku

దినదినంబు యేసుకు

Dinadinambu Yesuku

Lyricist: Vidhyaarthi Geethaavali
Verse
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా‖ 2x ‖
Verse
ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా‖ 2x ‖
పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా‖ 2x దినదినంబు ‖
Verse
మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా‖ 2x ‖
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా‖ 2x దినదినంబు ‖
Verse
ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము‖ 2x ‖
ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము‖ 2x దినదినంబు ‖
Verse
దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా‖ 2x ‖
ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా‖ 2x దినదినంబు ‖
Verse
పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా‖ 2x ‖
సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా‖ 2x దినదినంబు ‖

Related Tags

WorshipCommitment