Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dinadinambu Yesuku Daggaraga Cherutha

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా

Dinadinambu Yesuku Daggaraga Cherutha

Verse
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసుని నామదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు కనులెత్తి పాడుతా
ప్రభుని మాట నాదు భాట విభుని తోనే సాగుతా
Verse
మారిపోయే లోకమందు మనుష్యులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ చేరనా
Verse
దైవ వాక్యం జీవ వాక్యం దిన దినంబు చదువుతా
ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా
Verse
ఎన్నడు ఎడబాయడు నను విడువడు ఏ మాత్రము
ప్రభువే నాదు అభయము భయపడను నేనేమాత్రము
Verse
పరిశుద్దముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెద
సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా

Related Tags

WorshipDevotionalJesus