Verse
దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా‖ దినమెల్ల ‖
Verse
గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా‖ 2x ‖
నిను విడువనూ ఎడబాయననినా‖ 2x ‖
నా యేసయ్య‖ దినమెల్ల ‖
Verse
నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్‖ 2x ‖
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము‖ 2x ‖
నేను పొందాలని‖ దినమెల్ల ‖