Verse
దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా
జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షగా నిలిచెదవా‖ 2x ‖
మేలుకో ఓ. సోదరా మేలుకో ఓ. సోదరీ‖ 2x ‖
Verse
పనులకు సమయము వున్నా
క్రీస్తు సేవకు సమయము లేదా‖ 2x ‖
ప్రయాస పడుటకు సమయము నీకున్నా
ప్రార్థించుటకు సమయము లేదా‖ 2x ‖
ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ
Verse
అన్ని వినుటకు సమయము వున్నా
యేసు మాటకు సమయము లేదా‖ 2x ‖
మందితో గడిపే సమయము నీకున్నా
మందిరమునకు సమయము లేదా‖ 2x ‖
ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ