Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Divi nundi bhuviki raaraajugaa

దివి నుండి భువికి రారాజుగా

Divi nundi bhuviki raaraajugaa

Lyricist: Rev M Yesu Pau
Verse
దివి నుండి భువికి రారాజుగా
బేత్లెహేము పురముకు ఏతెంచెను‖ 2x ‖
గ్రామమంతా చిరునవ్వు లొలికె
పట్టణమంతా పండుగ చేసె‖ 2x ‖
సర్వలోకము సంబరమాయె‖ 2x ‖
Chorus
ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ
Verse
గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి బోళమును‖ 2x ‖
సాష్టాంగపడి తమ హృదయములన్
ప్రభువుకు కానుకలర్పించిరి
మనము కూడా అర్పించెదం
ప్రభువు నామము ఘనపరచెదం
మనము కుడా సాష్టాంగపడుచు
పరవశించుచు పాడెదము‖ ఆశ్చర్యకరుడు ‖
Verse
పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను‖ 2x ‖
పరిశుద్ధుడు జన్మించెనని
ఇహమున పరమున కొనియాడెదం
మనము కూడా కొనియాడెదం
ప్రభువు నామం ఘనపరచెదం
మనము కూడా హోసన్నయనుచు
కరములెత్తి పాడెదము‖ ఆశ్చర్యకరుడు గ్రామమంతా ‖

Related Tags

JesusChristmasBirth