Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Divinelu Sthothraarhudaa

దివినేలు స్తోత్రార్హుడా

Divinelu Sthothraarhudaa

Lyricist: Hosanna Ministries
Verse
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు – కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు‖ 2x ‖
Verse
మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు‖ 2x ‖
మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు
నీ కృపలే బలమైన కోటలు‖ 2x దివినేలు ‖
Verse
దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు‖ 2x ‖
దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్థిరమైన సంపద‖ 2x దివినేలు ‖
Verse
సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే‖ 2x ‖
దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము‖ 2x దివినేలు ‖

Related Tags

PraiseWorship