Verse
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి
ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా
ఇది నిదురించగా సమయమా
నీవెనుదిరిగితే న్యాయమా
ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు
ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు‖ 2x ‖
ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో‖ 2x ‖
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా‖ దివిటీలు ‖
రాకడ కాలపు సూచనలని చూచాయి
ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి‖ 2x ‖
పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి‖ 2x ‖
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా‖ దివిటీలు ‖