Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Divya Thaara

దివ్య తార

Divya Thaara

Lyricist: Gudeti Purushottham Babu
Verse
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్‖ 2x ‖
Verse
దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వచ్చిన తార‖ 2x ‖
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది‖ 2x ‖
పశుల పాక చేరినది క్రిస్మస్ తార‖ 2x దివ్య ‖
Verse
జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం‖ 2x ‖
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే‖ 2x ‖
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార‖ 2x దివ్య ‖
Verse
ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది‖ 2x ‖
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే‖ 2x ‖
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార‖ 2x దివ్య ‖
Verse
పాపలోక జీవితం – పటాపంచలైనది‖ 2x ‖
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే‖ 2x ‖
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార‖ 2x దివ్య ‖

Related Tags

JesusChristmasStar