Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Divya Yesu Meeda Naanukondumu Nitya Vishraanthini Pondiyundumu

దివ్య యేసు మీద నానుకొందుము నిత్య విశ్రాంతిని పొందియుందుము

Divya Yesu Meeda Naanukondumu Nitya Vishraanthini Pondiyundumu

Verse
దేవసమాధానం శాంతివలె
ప్రవహించుచుండు వరదరీతి
మెండుగాను పారుచుండు నిత్యము
నిండులోతుగాను వృద్ధియగును
Chorus
దివ్య యేసు మీద నానుకొందుము
నిత్య విశ్రాంతిని పొందియుందుము
Verse
చేతినీడ క్రింద నన్ను దాచెను
శత్రుభయముచే దిగులొందను
కాపాడును చంచలము రానీక
కించిత్తేని దుఃఖ పడనీయడు
Verse
నీడవలెనుండు దుఃఖక్లేశమున్
సూర్యజ్యోతియైన తన కృపచే
పారద్రోలి నిత్యానంద మిచ్చును
కాన జీవితము సఫలమగున్

Related Tags

JesusPeaceRest