Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi

Chorus
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
Verse
ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
Verse
రావే నీతి సూర్యుడా రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

Related Tags

WorshipChristmasNativity