Verse
దూతలు దిగివచ్చే భువిలో - ప్రభువుని స్తుతియింపా‖ 2x ‖
కాంతులు వెదజల్లే దివిలో - తారకొటఉదయించే‖ 2x ‖
మనకై ప్రభువే దీనుడై ఉదయించే‖ 2x ‖
Chorus
మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ‖ 2x ‖
Verse
ఘనుడగు దేవుడు తన ప్రియ సుతుని
మన రక్షణకై పంపించెను‖ 2x ‖
ఇట్టి రీతిగా దేవుడు
ప్రేమ చూపించెన్‖ 2x ‖
Chorus
మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ‖ 2x ‖
Verse
పరమును వదిలి భాగ్యము విడిచి
రిక్తునిగా తగ్గించుకొనెన్‖ 2x ‖
ఇట్టి రీతిగా ప్రభువు
భువికి ఏతెంచెన్‖ 2x ‖
Chorus
మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ‖ 2x ‖