Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dorakunu Samasthamu Yesu

దొరకును సమస్తము యేసు

Dorakunu Samasthamu Yesu

Verse
దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా‖ దొరకును ‖
Verse
మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి‖ 2x ‖
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు‖ 2x ‖
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాప క్షమాపణ‖ 2x దొరకును ‖
Verse
యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి‖ 2x ‖
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు‖ 2x ‖
కలిగెను మహదానందం
దొరికెను రక్షణ భాగ్యము‖ 2x దొరకును ‖
Verse
పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను‖ 2x ‖
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా‖ 2x ‖
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం‖ 2x దొరకును ‖

Related Tags

WorshipPrayerJesus