Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Draakshaavallivi Neevaithe

ద్రాక్షావల్లివి నీవైతే

Draakshaavallivi Neevaithe

Verse
ద్రాక్షావల్లివి నీవైతే
తీగెగ నేను ఎదిగితిని‖ 2x ‖
తండ్రి తోటలో నే నాటబడితి
ఎంత ధన్యత ఈ మహిలో‖ 2x ద్రాక్షా ‖
Verse
చల్ల గాలులు వీచగా
కాంతి కిరణాలు ప్రసరించగా‖ 2x ‖
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటి యోరన నిలిచితిని‖ 2x ద్రాక్షా ‖
Verse
కొమ్మ కొమ్మను చూడగా
తీగలెన్నో అగుపించెనే‖ 2x ‖
ఆకు మాటున తీగె గావున
మొలవనున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో‖ 2x ద్రాక్షా ‖

Related Tags

PraiseWorship