Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Drakshavallini Nenu Drakshathe

ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాత

Drakshavallini Nenu Drakshathe

Lyricist: M J Ramanjulu
Verse
ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె
అతిముదమునను వినరండి‖ ద్రాక్షా ‖
Verse
నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు
నాయందుండుడి ఫలియింపన్‖ ద్రాక్షా ‖
Verse
ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము
తధ్యము నిప్పులలో‖ ద్రాక్షా ‖
Verse
ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్
యెఱుగరే మీరది అనవరతం‖ ద్రాక్షా ‖
Verse
నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు
నాణ్యపు ఫలములనిచ్చు నాహా‖ ద్రాక్షా ‖
Verse
మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో
వెంటనే యెండిపోయెదరు‖ ద్రాక్షా ‖
Verse
కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని
పలుకుల్ మదిదలచెద మిల మరువకను‖ ద్రాక్షా ‖

Related Tags

Fruitfulness