Verse
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే‖ 2x ‖
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక‖ 2x దుర్దినములు ‖
Verse
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది‖ 2x ‖
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం‖ 2x ‖
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు‖ 2x దుర్దినములు ‖
Verse
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి‖ 2x ‖
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ‖ 2x ‖
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని‖ 2x దుర్దినములు ‖